వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు? | Confusion In Mylavaram TDP Cadre: Devineni Uma Vs Vasantha Krishna Prasad In Mylavaram, Details Inside - Sakshi
Sakshi News home page

వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?

Published Thu, Feb 29 2024 12:25 PM

Devineni Uma Vs Vasantha Krishna Prasad In Mylavaram - Sakshi

మైలవరం టీడీపీ కేడర్‌లో గందరగోళం

శవరాజకీయాలు మొదలుపెట్టిన మాజీ మంత్రి దేవినేని

 
ఉమాపై పోస్టింగ్‌ల దాడి చేస్తున్న వసంత వర్గీయులు 

 
వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా అనుచరులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైలవరం టీడీపీ రాజకీయాలు గందరగోళంగా మారాయి. టిక్కెట్టు లేదని దేవినేని ఉమాకు చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆయనకు మైలవరం నియోజక వర్గం టిక్కెట్టుపై ఆశలు మాత్రం చావలేదు. ఏదో పని కలి్పంచుకొని మైలవరం  చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏదో అనారోగ్యంతో సాధారణంగా చనిపోయిన, దేవినేని ఉమాకు టిక్కెట్‌ రాకపోవడంతో బాధతో గుండె ఆగిపోయిందని ప్రచారం చేసుకొనే స్థాయికి ఆయన దిగజారారు. మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడంలో స్పెషలిస్టుగా పేరున్న దేవినేని ఉమా  చివరి యత్నంగా శవరాజకీయ అ్రస్తాన్ని బయటికి తీశారు. ఇది నియోజక వర్గంలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. దేవినేని ఉమా చీప్‌ ట్రిక్స్‌ చూసి, నియోజక వర్గ ప్రజలు సైతం నవ్వుకొంటున్నారు.   

వసంత వర్గంలో కల్లోలం.... 
అధిష్టానం పిలిచి మాట్లాడినప్పటికీ దేవినేని ఉమా పోకడలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వసంత వెంకటకృష్ణప్రసాద్‌ కోటరీలో కల్లోలం మొదలైంది.  దేవినేనికి మైలవరం ఎమ్మెల్యే సీటు లేదంటూ గత ఆదివారం న్యూస్‌ వైరల్‌ అయిన రోజున మైలవరం మండలం, చండ్రగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త పుల్లారావు, సోమవారం ఇబ్రహీంపట్నంకు చెందిన నూతక్కి సురేష్‌లు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఈ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దేవినేని ఉమాకి సీటు రానందుకే మృతి చెందారని చిత్రీకరించి వీరిద్దరి కుటుంబాలను దేవినేని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమా అనుచరులు వసంత డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. 

ఈ ఘటన వైరల్‌ కావడంతో కల్లోలానికి గురైన వసంత వెంకటకృష్ణప్రసాద్‌ తన అనుచరుల చేత ఉమా శవరాజకీయాలు చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు  పెట్టించారు. చండ్రగూడెంకు చెందిన పుల్లారావు అనారోగ్యంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న ఆడియోలను సైతం వైరల్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఉమ కుటుంబ చరిత్రను సైతం టచ్‌ చేసి ఆయన సోదరుడు రమణ మరణానంతరం వదిన ప్రణీతను చంపింది దేవినేని ఉమానేనంటూ, ఇటీవల మృతి చెందిన ఉమా సోదరుడు చంద్రశేఖర్‌  మృతికి సైతం పరోక్ష కారణం ఉమానే అంటూ సోషల్‌ మీడియాలో వసంత వర్గీయులు పోస్టులు పెట్టడం కలకలం రేపింది. 

ఆది నుంచి రాజకీయ శత్రువులే.. 
మెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమానుకాదని, వసంత కృష్ణ ప్రసాద్‌కు సీటు కేటాయించడం అక్కడ టీడీపీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, దేవినేని ఉమా మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేడన్న భావన టీడీపీ క్యాడర్లో నెలకొంది.  వసంతకృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరకముందే. సోషల్‌మీడియా వేదికగా వస్తున్న పోస్టులు, వారి మధ్య సాగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీడీపీ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్నారు. 

నోటా ఓటు వేయాలని....
వసంత వెంకటకృష్ణప్రసాద్‌పై టీడీపీ అధిష్టానం  సోమ, మంగళవారాల్లో సర్వే జరిపింది. వసంతకు నో చెబుతూ నోటాకే తమ ఓటు అనేలా టీడీపీ కేడర్‌ను దేవినేని ఉమా వర్గీయులు సోషల్‌ మీడియా ద్వారా ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement