కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే 

1 Mar, 2021 09:11 IST|Sakshi
కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాకటౌన్‌: కేంద్ర మానవ వనరులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కేటాయించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.  

బాధితులకు న్యాయం చేయాలి 
దుబ్బాకటౌన్‌: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగవద్దని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం, ముంపు బాధితుల సమస్య తదితర విషయాలపై సంబంధిత అధికారులతో శనివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం, కాలువల నిర్మాణంతో నష్టపోతున్న బాధితులకు అందించిన సాయంపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా పరిహారం అందించాలన్నారు. పరిహారం పంపిణీలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఉండాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అధికారులు తదితరులు ఉన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు