బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు | Sakshi
Sakshi News home page

బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు

Published Sun, Apr 28 2024 6:11 PM

Election Commission bans AAP Slogan

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల సంఘం (ఈసీ).. ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిచ్చింది. ఆప్ ప్రచారగీతమైన 'జైల్ కే జవాబ్ మే హమ్ వోట్ దేంగే'పైన నిషేధం విధించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ రోజు జరిగింది ఇదే.. బీజేపీ మరో ఆయుధంగా ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార గీతాన్ని నిషేధించిందని పేర్కొన్నారు.

బీజేపీ ప్రతి రోజూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించినప్పటికీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పీల్చుకున్న నోటీసులు వస్తాయని అతిషి అన్నారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ కూడా చేశారు.

ర్యాప్ స్టైల్‌లో ప్రదర్శించిన 'జైల్ కా జవాబ్ వోటే సే' అనే ప్రచార గీతాన్ని గురువారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పాటను ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్ దిలీప్ పాండే రచించి స్వరపరిచారు. దీన్ని కూడా ఇప్పుడు నిషేధించారని అతిషి అన్నారు.

Advertisement
Advertisement