బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్‌ వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్‌ వ్యాఖ్యలు

Published Sat, Feb 3 2024 12:56 PM

Ex Minister KTR Interesting Comments Over Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోందని దుయ్యబట్టారు. ఇది, బీజేపీకే లాభం అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాగా, తాజాగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‍స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌..‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 

గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోంది. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుంది. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరు. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement