కుప్పం టీడీపీలో ముసలం..

4 Apr, 2021 15:44 IST|Sakshi

చంద్రబాబు తీరుపై నేతల ఆగ్రహావేశాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపాటు

నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల రాజీనామా

సాక్షి, చిత్తూరు: కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసి వారు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

టీడీపీ అభ్యర్థులు,కార్యకర్తలు, డీలాపడ్డారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేం ఎన్నికల కోసమని లక్షల రూపాయలు ఖర్చుపెట్టాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశాం. గెలిపించాలని ఏడాదిగా గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు బహిష్కరించమంటే ఎలా..?. అధినేత నిర్ణయంతో నష్టపోయేదెవరు..? నామినేషన్లకు పెట్టిన డబ్బులు ఎవరిస్తారు..?’ అంటూ కుప్పంలోని టీడీపీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? 
గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు