మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర | Sakshi
Sakshi News home page

మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర

Published Fri, May 10 2024 5:34 AM

Huge amount of illegal liquor from neighboring states

పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం

రూ.వెయ్యి కోట్ల గోవా మద్యం దిగుమతి చేసిన టీడీపీ

ఆ పార్టీ నేతల ఇళ్లే అక్రమ మద్యం గోడౌన్లు

పంపిణీకి ప్రత్యేకంగా మద్యం కమిటీల నియామకం

ఎన్నికల్లో అక్రమాలకు బరితెగించిన ‘పచ్చ’ముఠా

మద్యం మత్తులో ఉన్న భర్తలతో అరాచకానికి బాబు ఎత్తుగడ

తద్వారా మహిళలను బెదిరించి.. వేధించి టీడీపీకి అనుకూలంగా మలుచుకోవాలని పన్నాగం

» కృష్ణాజిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలో టీడీపీ నేత తులసీమోహన్‌ నివాసంలో అక్రమంగా నిల్వచేసిన రూ.79 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడైన ఆయన నివాసంలో 1,210 బాక్సుల్లో ఉన్న 58,080 మద్యం బాటిళ్లను అధికారులు జప్తుచేశారు.

»  ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మరో టీడీపీ నేత భీమ వెంకటేశ్వరరావు నివాసంలో అక్రమంగా నిల్వచేసిన  రూ.12.48 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని సెబ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

..ఇవీ సెబ్‌ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం వివరాలు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు, సెబ్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు విస్తృతంగా జరుపుతున్న సోదాల్లో ఇప్పటివరకు రూ.28.83 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా టీడీపీ నేతలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నవే. 

ఇవి ఇప్పటివరకు పోలీసులు, సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం నిల్వలు మాత్రమే. కానీ, పోలీసుల కళ్లుగప్పి ఇప్పటికే భారీగా అక్రమ మద్యాన్ని టీడీపీ ముఠా రాష్ట్రంలోకి తరలించేసింది. అంటే.. టీడీపీ ఎంత భారీస్థాయిలో రాష్ట్రంలోకి అక్రమ మద్యాన్ని కుమ్మరిస్తోందన్నది తేటతెల్లమవుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు ఇప్పటికే నల్లధనాన్ని గుట్టలు గుట్టలుగా కుమ్మరిస్తున్న చంద్రబాబు.. ఓటర్లను చిత్తు చేసేందుకు అక్రమ మద్యాన్ని కూడా భారీగా పారిస్తున్నారు. 

ఇందుకోసం పకడ్బందీగా కుట్రను అమలుచేస్తున్నారు.పొరుగు రాష్ట్రాల నుంచి రూ.వేయి కోట్ల అక్రమ మద్యం.. మద్యం ద్వారా ఓటర్లను చిత్తుచేయాలన్న కుతంత్రాన్ని అమలుచేసే బాధ్యతను కూడా బాబే తన భుజానికెత్తుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ పూర్తి పారదర్శకంగా సాగుతున్నాయి.  వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకా­ణాల విధానాన్ని రద్దుచేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏ­ర్పాటు­చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని డిస్టిలరీలు, ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ అంతా ఈసీ పర్యవేక్షణ కిందకు వచ్చాయి.

 విజయవాడలో ఎక్సైజ్‌ శాఖ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. డిస్టిలరీలు, బ్రూవరీలు, బెవరేజస్‌ కార్పొరే­షన్‌కు చెందిన మద్యం డిపోలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా మద్యం సరఫరా, విక్ర­యాలను పర్యవే­క్షిస్తు­న్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సమకూర్చలేమని భావించిన బాబు.. పొరుగు రాష్ట్రాలపై కన్నేశారు. తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్‌ పెద్దల అండదండలతో ఈ కుట్రకు తెరతీశారు. తక్కువ ధర ఉండే నాసిరకరమైన గోవా మద్యాన్ని భారీగా అక్కడి నుంచి తెప్పించారు. ఇలా దాదాపు రూ.వేయి కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. 

మద్యం మత్తుతో చిత్తుచేయండి..
ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే తన కుంతంత్రాన్ని చంద్రబాబు మరోసారి తెరపైకి తెచ్చారు.  పేద, దిగువ మధ్య తరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన మద్యం మాయోపాయానికి పాల్పడుతున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న ఓటర్లు ఈ సమయంలో విచక్షణా శక్తిని కోల్పోయి మద్యం మత్తులో ఉండేట్లు చేయా­లన్నది ఆయన పన్నాగం. ప్రధానంగా మహిళా ఓటర్లు వైఎస్సార్‌సీపీకి పూర్తి అనుకూలంగా ఉండటం చంద్రబాబును హడలెత్తిస్తోంది. దాంతో పురుషులను గోవా మద్యం మత్తులో ముంచి వారితో మహిళలను బెదిరించి.. వేధించైనా సరే టీడీపీకి అనుకూలంగా మలచుకోవాలన్నది ఆయన ఎత్తుగడ.  

అందుకోసం నియోజకవర్గాల వారీగా పేద, దిగు­వ మధ్య తరగతి వర్గాలు ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అక్కడ అక్రమ మద్యాన్ని పంపిణీ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వీటిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఇక ఏఏ నియోజకవర్గాలకు ఏమేరకు మద్యం సరఫరా చేయాలి.. అందుకు ఏఏ మార్గాల్లో దానిని తరలించాలి.. ఎక్కడెక్కడ నిల్వచేయాలి.. ఎన్నికలకు మూ­డ్రోజుల ముందు మండలాలు, పంచాయతీలకు ఎలా చేర్చాలి.. అన్నదానిపై పకడ్బందీగా స్కెచ్‌ వేశారు. సాధారణంగా.. పోలింగ్‌ కోసం బూత్‌ కమిటీలను నియంమించడం అన్ని రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహమే. కానీ, చంద్రబాబు అందుకు అదనంగా కేవలం మద్యం పంపిణీకి ప్రత్యేకంగా కమిటీలను నియమించడం గమనార్హం. 

రాష్ట్రంలోకి రూ.వెయ్యికోట్ల నాసిరకం మద్యం..
నాసిరకమైన గోవా మద్యం తాగితే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని తెలిసినా స రే.. పోయేవి సామాన్యుల ప్రాణాలే కదా అన్న రీతిలో చంద్రబాబు ఎన్నికల అక్రమా­లకు బరితెగించారు. ఆ విధంగా తెప్పించిన రూ.వేయి కోట్ల విలువైన గోవా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడు, ఎన్టీఆర్, ఏలూ­రు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామ­రాజు జిల్లాల మీదుగా.. కర్ణాటక నుంచి శ్రీ­సత్యసాయి, కర్నూలు జిల్లాల మీదుగా ఏపీలోకి తరలించారు. అప్పటికే స్టాక్‌ పా­యిం­ట్లుగా గుర్తించిన టీడీపీ నేతల ని­వాసాలు, వ్యాపార సంస్థల గిడ్డంగుల్లోకి వా­టి­ని చేర్చారు. పోలింగ్‌కు ఎక్కువ సమయం లేనందున ఆ గిడ్డంగుల నుంచి మండలాలు, పంచాయతీల వారీగా పంపిణీ మొదలు­పెట్టారు. 

Advertisement
 
Advertisement