Sakshi News home page

ప్రమాదంలో ప్రజాస్వామ్యం 

Published Mon, Apr 1 2024 4:08 AM

INDIA anti Modi opposition alliance holds mega rally in Delhi - Sakshi

కేజ్రీవాల్, సోరెన్‌ అరెస్టులే నిదర్శనం 

వ్యవస్థలను నాశనం చేస్తున్న మోదీ 

మండిపడ్డ ఇండియా కూటమి నేతలు 

రాంలీలా మైదానంలో భారీ బల ప్రదర్శన

నియంతృత్వాన్ని తరిమేద్దామంటూ పిలుపు 

ఎన్డీఏ దోస్తులుగా ఈడీ, ఐటీ, సీబీఐ: ఖర్గే 

మోదీ సొంత వ్యక్తులకు ఈసీలో చోటు 

ఎన్నికల ఫిక్సింగ్‌కు యత్నం: రాహుల్‌ 

ప్రధానాకర్షణగా కేజ్రీవాల్, సోరెన్‌ భార్యలు 

బీజేపీని ఓడించాలన్న సునీత, కల్పన 

సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్‌ సారథి అరవింద్‌ కేజ్రీవాల్, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది.

‘తానాషాహీ హటావో, లోక్‌తంత్ర్‌ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్‌ సీఎం, ఆప్‌ నేత భగవంత్‌మాన్‌ సింగ్, అఖిలేష్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ), డెరిక్‌ ఒబ్రియాన్‌ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ–పవార్‌), ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్‌ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్‌ సతీమణి సునీత, హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్‌ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్‌ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్‌ పవార్‌ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్‌ పిలుపునిచ్చారు. తృణమూల్‌ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్‌ చెప్పారు.

కూటమి డిమాండ్లు...
కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్‌ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ వేయాలని డిమాండ్‌ చేశారు.  

ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం 
‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు.

అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్‌ సోరెన్‌ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్‌కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 

కేజ్రీవాల్‌ సింహం: సునీత 
‘‘కేజ్రీవాల్‌ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు.

మా రక్తంలోనే పోరాటం: కల్పన 
రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు.

నిర్ణాయక ఎన్నికలివి...
‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్‌ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్‌ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. లోక్‌సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్‌ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్‌ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది.

తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్‌ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’     – కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ 

అహంకారానికి అంతం తప్పదు 
‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ 
– కాంగ్రెస్‌ నేత  ప్రియాంకా గాంధీ వాద్రా 

Advertisement
Advertisement