Siddam Sabha: అందరి చూపు.. ఆఖరి ‘సిద్ధం’ వైపు | Interested In CM YS Jagan Speech In Medarametla Final Siddham Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

Medarametla Siddam Sabha: అందరి చూపు.. ఆఖరి ‘సిద్ధం’ వైపు

Published Sat, Mar 9 2024 4:44 PM

Interested In Cm Jagan Speech In Medarametla Siddham Meeting - Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: సీఎం జగన్‌ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడదల రజని అన్నారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సిద్ధం సభలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, ఏపీ రాజకీయ చర్రితలోనే సిద్ధం సభలకు కనీవిని ఎరుగని ప్రజామద్దతు లభిస్తోందన్నారు.

గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లాలో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పా­టు చేశారు. సీఎం జగన్‌ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్‌ ఏర్పాటు చేశారు.

ఐదేళ్ల పాలన ప్రగతిని సీఎం.. ప్రజలకు వివరించున్నారు. సీఎం ప్రసంగం కోసం ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిద్ధం సభ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారి కోసం వందల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు సిద్ధం చేశారు. సభకు తరలివచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభావేదిక నుంచి పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.


 

Advertisement
Advertisement