చొప్పదండి: అధికార పార్టీకి రెబల్స్‌ బెడద.. | Sakshi
Sakshi News home page

చొప్పదండిలో అధికార పార్టీకి రెబల్స్‌ బెడద..వాటికి లైన్‌క్లియర్‌

Published Thu, Aug 10 2023 7:11 PM

Karimnagar: Who Win Next Incumbent in Choppadandi Constituency - Sakshi

BRS పార్టీ నుండి 2014 లో బొడిగె శోభ , 2019 లో సుంకే రవిశంకర్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మాదిగ, మాల, బిసి కులాలు నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసేలా ఉన్నా‍యి. పైగా బీఆర్‌ఎస్‌కు ఈసారి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేరు. బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి BSP  నుండి పోటీ  చేసే అవకాశం లేకపోలేదు.

ఆశావాహులు 

BRS ..

  • సుంకె రవిశంకర్

CONGRESS

1)మేడిపల్లి సత్యం(చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి)

BJP
1) బొడిగ శోభ(మాజీ ఎమ్మెల్యే, చొప్పదండి)

2) సుద్దాల దేవయ్య(మాజీమంత్రి)


BRS ప్రతికూల అంశాలు:

  • బోయినిపల్లి,రామడుగు,గంగాధర మండలాల్లో లో ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం.
  • రైతుల ధర్నాలు చేసిన పట్టించుకోకపోవడం ,సమస్యలు ఉన్నా చోటికి వెల్లకపోవడం.
  • కొండగట్టు అభివృద్ధి పనులు ప్రారంభించక పోవటం.
  • కులవసంఘ భవనాలకు,దళిత బంధు కు కమీషన్లు తీసుకోవడం.
  • స్వంత ఊరిలో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకోవడం,గంగాధర, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేయడం.
  • పార్టీ ప్రజాప్రతినిధులు పనులు  పూర్తి చేసిన  బిల్లులు రాక  పోవటం.
  • తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గం పై అక్రమ కేసులు పెట్టడం.
  • మండల,గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం.
  • తమకు విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై అధిష్ఠానంకు రెడ్డి, రావు నాయకుల ఫిర్యాదు.

అనుకూలతలు

గాయత్రీ పంపు హౌజ్ నిర్మాణం, చొప్పదండి మున్సిపాలిటీ కావడం, స్మార్ట్ సిటీ పనులు చేపట్టడం. సీఎం రిలీఫ్ పండ్,కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద  మంచిపేరు ఉండటం.

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మైనస్‌లు:

  • కొండగట్టు ఆలయ అభివృద్ధికి హామీలు తప్ప, పనులు ప్రారంభించక పోవటం. ముంఫు గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవటం,అవసరం ఉన్న మండలాల్లో రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవటం.
  •  పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం.
  • ఎమ్మెల్యే  అక్రమ ఆస్తులు.

Advertisement
Advertisement