Karnataka Budget Session Congress Leaders Protest - Sakshi
Sakshi News home page

చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

Published Fri, Feb 17 2023 2:01 PM

Karnataka Budget Session Congress Leaders Protest - Sakshi

బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు.

బీజేపీ గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, 2018 మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను 'కివిమెలెహూవ'గా అభివర్ణించారు. అంటే ప్రజలను ఫూల్స్ చేస్తోందని అర్థం.

సీఎం బొమ్మై ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఆరోపించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వెనక్కితగ్గకుండా నిరసనలు కొనసాగించారు. సీఎం మాత్రం యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. రామనగరలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తరచూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలం పార్టీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇస్తే వాటిలో 10 శాతం మాత్రమే అమలు చేసిందని ధ్వజమెత్తారు.
చదవండి: అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్

Advertisement
Advertisement