సాక్షి, అమరావతి: ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నీ ప్రతిపక్ష హోదాతోపాటు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా వదులుకో.. నేనూ, వంశీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం. నల్లమల అడవికో, బందరు బీచ్‌కో వెళ్లి కొట్టుకుందాం..’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) ప్రతి సవాల్ విసిరారు.
‘మన పోరాటంలో మేం చచ్చిపోతే నిన్ను జైల్లో పెడతారు.. నువ్వు చస్తే మమ్మల్ని జైల్లో వేస్తారు. ఈ రాష్ట్రానికి పట్టిన నీ దరిద్రం పోతుంది’ అని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
► రెండు గ్లాసులు, ఒక కంప్యూటర్ పగిలిన కార్యక్రమాన్ని చూసేందుకు గన్నవరం వెళ్లిన చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. ఆయన అరుపులు విని పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చారని గన్నవరం ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే రామ్మూర్తినాయుడిని కట్టేసినట్లుగా చంద్రబాబును కుటుంబ సభ్యులే బంధించాలి.
► బ్రెయిన్లెస్ కిడ్ లోకేశ్.. పిల్లోడు, రాజకీయాలు తెలియనోడు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడని జనం అనుకుంటారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటే లోకేశ్ ఆయన్ను కొరికి ఉంటారేమోననే అనుమానం కలుగుతోంది. దీర్ఘాలు తీస్తూ సినిమా డైలాగులు చెబుతున్న చంద్రబాబు ఖాళీగా ఉండలేక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఏమైనా చూశారా? ఆయన పిచ్చి మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుని చివరకు జైలు పాలవుతున్నారు.
► ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అని ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు మూగ జీవాల పాల ఉత్పత్తులతో వ్యాపారం చేసి కోట్లు కూడబెడుతుండటం నిజం కాదా? ఆయన దిక్కుమాలిన రాజకీయం నాకు, వంశీకి చాలా బాగా తెలుసు. మాతో పెట్టుకోవద్దు. పట్టాభిని గన్నవరం పంపిందే చంద్రబాబు. అక్కడ ఏ పార్టీ వారికీ గాయాలు కాలేదు. ఘర్షణ కట్టడి చేయడానికి వెళ్లిన పోలీసులకు మాత్రమే గాయాలయ్యాయి. టీడీపీ మూకల దాడిలో సీఐ తల పగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు పోలీసుల తాట తీస్తానంటూ బెదిరిస్తున్నారు. సీఐ, డీజీపీ క్రిస్టియన్ అంటూ మతాల పేరిట రెచ్చగొట్టే యత్నాలను ప్రజలు గమనించాలి.
అందుకు టెలిఫోన్ ఆపరేటర్ చాలు..
గూగుల్ టేకవుట్ ఏమిటి? ఒక లొకేషన్ నుంచి ఎంతమంది ఫోన్లలో మాట్లాడారో చెప్పేందుకు సీబీఐ ఎందుకు? ఒక టెలిఫోన్ ఆపరేటర్‌కు అప్పగిస్తే ఎప్పుడో తేల్చేసే వారు. ఎవరి ఫోన్ ఎవరికి వెళ్లిందో చెప్పేదాన్ని సీబీఐ ఎంక్వైరీ అనరు. దాన్ని టీవోఐ (టెలిఫోన్ ఆపరేటర్ ఎంక్వైరీ) అని నేను భావిస్తున్నా.
అడవిలోనా.. బీచ్‌లోనా?
Published Sat, Feb 25 2023 5:10 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
ఎన్నికలకు ముందే ఏ స్థాయిలో కుట్రలంటే.. : సీఎం జగన్
హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?
ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..సీఎం జగన్ ప్రయత్నం కూడా ఇదే..
నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని
ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement