కేసీఆర్‌కు అరెస్టు భయం.. అందుకే యాత్రలు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు అరెస్టు భయం.. అందుకే యాత్రలు

Published Sat, Apr 6 2024 4:44 AM

Komatireddy Venkat Reddy Comments On KCR - Sakshi

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శిక్ష ఖాయమనే జనంలో సానుభూతికి రాజకీయ టూర్లు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టు భయంతో ప్రజల్లో సానుభూతి కోసమే కేసీఆర్‌ రాజకీయ యాత్రలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ కేసులో సంబంధిత చట్టం ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.  ప్రజాప్రాతి నిథ్య చట్టం ప్రకారం, వరుసగా రెండేళ్లు జైలు శిక్ష పడితే ఆరేళ్ల  పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదని, ఇక కేసీఆర్‌ రాజకీయాలు వదిలేస్తే మంచిదని సూచించారు. అరెస్టు భయంతోనే ఇప్పుడు కేసీఆర్‌ యాత్రలు చేస్తున్నారే తప్పించి ఏనాడూ ప్రజల గురించి చిత్తశుద్ధితో పనిచేయలేదని గుర్తు చేశారు.

ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలపై తాను కేసీఆర్‌ను నిలదీస్తే, కేసీఆర్‌ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనకు వారిలా బూర్చుఖలీఫాలో ఇల్లు లేదనీ, ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడించారు. ‘నాకు కంపెనీ ఉంటే నిరూపించాలని, గాలిమా టలతో తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదు. నీలా తప్పులు చేసే వ్యక్తిని కాదు, నా గురించి మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకుని మాట్లాడాలి’ అని సూచించారు. 

వర్షాభావం కాంగ్రెస్‌ వైఫల్యమా: పొంగులేటి
వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపేందుకు కేసీఆర్‌ శతవి ధాలా ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్న రేళ్లు సీఎంగా ఉండి, తన హయాంలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే ఏనాడూ పంటపొ లాలకు వెళ్లి రైతులను పరామర్శించని కేసీఆర్‌కు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ వరకు వచ్చిన కేసీఆర్, పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని దెబ్బతిన్న పిల్లర్లను కూడా సందర్శించి ఉంటే బాగుండేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement