క్యా హువా తేరా వాదా..?: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల లక్ష్యాలు ఘనం మరి.. గత హామీల సంగతి?: కేటీఆర్‌

Published Wed, Aug 17 2022 7:32 AM

KTR Praise PM Modi 25 Years Plan Later Asks Promises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వచ్చే 25 ఏళ్లకుగాను మీరు ప్రకటించిన లక్ష్యాలు బాగున్నాయి. కానీ గతంలో మీరిచ్చిన హామీల సంగతేంటి?’అని ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నిలదీశారు.

‘2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రమాణాలు ఏమయ్యాయి నరేంద్రమోదీ గారూ!’ అని ట్వీట్‌ చేశారు. ‘క్యా హువా తేరా వాదా’హ్యాష్‌ట్యాగ్‌తో వార్తా పత్రికల క్లిప్పింగ్‌ల ఫోటోను కేటీఆర్‌ అప్‌లోడ్‌ చేశారు. దాంట్లో మోదీ గతంలో చేసిన ప్రసంగాలను ప్రస్తావించారు.

2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం, రైతుల ఆదాయం రెట్టింపు, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లుగా మార్చడం, ప్రతి ఇంటికీ కరెంటు సరఫరా, మొదలైన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. మీరు గతంలో చేసిన ఈ వాగ్దానాల గురించి దేశం తెలుసుకోవాలి అనుకుంటోందన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు, వైఫల్యాలను గుర్తుంచుకోకపోతే జవాబుదారీతనం ఎక్కడుంటుందని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement