బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏపీలో ఎంపీ అభ్యర్థులు వీరే.. | Sakshi
Sakshi News home page

బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏపీలో ఎంపీ అభ్యర్థులు వీరే..

Published Sun, Mar 24 2024 9:42 PM

Lok Sabha Election 2024: Announcement Of Bjp Candidates In Ap - Sakshi

రఘురామకృష్ణం రాజుకు నో టికెట్.. ఝలక్‌ ఇచ్చిన బీజేపీ

ఏపీలో చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు

వలస పక్షులకే ఏపీ బీజేపీలో ఎంపీ సీట్లు

జీవీఎల్, సోము వీర్రాజుకు ఎంపీ సీట్లలో దక్కని స్థానం

అసలైన బీజేపీ నేతలకు దక్కని సీట్లు

బీజేపీలో తమ వాళ్లకు ఎంపీ సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం

జాబితా చూడగానే అసలు బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. 17 రాష్ట్రాలలో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్‌ చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో కూడిన బీజేపీ జాబితాలో ఏపీ నుంచి ఆరు, తెలంగాణ నుంచి రెండు లోక్‌సభ సీట్లకు అభ్యర్థులు ప్రకటించింది. రఘురామ కృష్ణంరాజుకు బీజేపీ ఝలక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు రఘురామ కృష్ణంరాజును చంద్రబాబు వాడుకొని వదిలేశారు. చంద్రబాబు.. రఘురామ కృష్ణంరాజు గొంతు కోశారని ఆయన వర్గీయులు అంటున్నారు. నర్సాపురం ఎంపీ టికెట్ శ్రీనివాస్ వర్మకే బీజేపీ కేటాయించింది.

చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు
ఏపీలో చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు కేటాయించింది. వలస పక్షులకే ఏపీ బీజేపీలో ఎంపీ సీట్లు ఇచ్చింది. సీఎం రమేష్‌కు అనకాపల్లి, పురందేశ్వరి రాజమండ్రి సీట్లు ఇవ్వగా, జీవీఎల్, సోము వీర్రాజుకు ఎంపీ సీట్లలో స్థానం దక్కలేదు. అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు ఎత్తుగడలతో బీజేపీలో తమ వాళ్లకు ఎంపీ సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం పన్నారు. జాబితా చూడగానే అసలు బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఏపీ లోక్‌ సభ అభ్యర్థులు..
అనకాపల్లి- సీఎం రమేష్
అరకు- కొత్తపల్లి గీత
రాజమండ్రి- పురందేశ్వరి
నరసాపురం-  శ్రీనివాస వర్మ
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
తిరుపతి-  వరప్రసాద్

ఇక, తెలంగాణ నుంచి రెండు ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్‌ నుంచి ఆరూరి రమేష్‌, ఖమ్మం తాండ్ర వినోద్‌ రావులకు టికెట్లు కేటాయించింది. 

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement