తరాల నిరీక్షణకు తెర | Sakshi
Sakshi News home page

తరాల నిరీక్షణకు తెర

Published Sun, Feb 11 2024 2:08 AM

Lok Sabha has taken decisions awaited by many generations: PM Modi - Sakshi

పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్‌సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టీకల్‌ 370 రద్దు చేయడంతోపాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఈ సభలోనే ఆమోదం లభించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్‌ (సంస్కరణలు), పెర్ఫామ్‌ (పనితీరు), ట్రాన్స్‌ఫార్మ్‌ (మార్పు) కాలంగా సాగాయి.

దేశమంతటికీ ఒకే రాజ్యాంగం ఉండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్‌ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. ఈ ఐదేళ్లలో పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్‌కు పునాదులు వేశామని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్‌సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో పాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్‌ (సంస్కరణలు), పెర్ఫామ్‌ (పనితీరు), ట్రాన్స్‌ఫార్మ్‌ (మార్పు) కాలంగా సాగాయి. దేశమంతటికీ ఒకే రాజ్యాంగముండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్‌ దూసుకుపోతోంది.

ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్‌కు ఈ ఐదేళ్లలో పునాదులు వేశామని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అభినందిస్తూ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో స్పీకర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘17వ లోక్‌సభకు ఇది చివరి పని దినం. గొప్ప మార్పులకు, నిర్ణయాలకు వేదికగా నిలిచిన 17వ సభను దేశం ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు.

రామాలయ అంశంపై బీజేపీపై విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తూ వచ్చాయంటూ మోదీ మండిపడ్డారు. ‘‘వాస్తవమేమిటంటే ఇలాంటి గొప్ప బాధ్యతలను తలకెత్తుకుని పూర్తి చేసే సామర్థ్యం అందరికీ ఉండదు. చేతులెత్తేసి పారిపోతారు’’ అంటూ చురకలు వేశారు. ‘‘ఆలయ నిర్మాణంపై ఈ రోజు సభలో జరిగిన చర్చలు మన సహానుభూతికి, సున్నితత్వానికి, ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’ అన్న మా ప్రభుత్వ దీక్షకు అద్దం పట్టాయి’’ అన్నారు. 

దేశ ఘనత పెంచనున్న ఎన్నికలు 
రానున్న లోక్‌సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఘనతను మరింత పెంచుతాయని తనకు పూర్తి నమ్మకముందన్నారు. ‘‘బ్రిటిష్‌ కాలం నాటి ‘శిక్షాత్మక’ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ చట్టాలను తెచ్చాం. కరోనా సవాలును అధిగమించడంలో ప్రపంచ దేశాలకే భారత్‌ బాసటగా నిలిచింది. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని వీలైనంతగా తగ్గించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ సామర్థ్యానికి గీటురాయి. ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ మన మూలమంత్రం’’ అన్నారు.

Advertisement
Advertisement