మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా | Sakshi
Sakshi News home page

మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా

Published Sun, Apr 28 2024 3:34 PM

Mafia In Up Now Pleading Under Govt Says Cm Yogi Adityanath

గత ప్రభుత్వంలో నేరస్తులు సురక్షితంగా ఉండేవారు. కానీ పరిస్థితులు మారాయి. బీజేపీ ప్రభుత్వంలో నేరస్తులు లొంగిపోవాలని చూస్తున్నారు. లేదంటే వారి ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేసుకుంటున్నారని ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బరేలీలో జరిగిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఇది మన (బీజేపీ) ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ రక్షణలో ఉన్న మాఫియా ఇప్పుడు లొంగిపోవాలని చూస్తుందని అన్నారు.  సమాజ్ వాదీ పార్టీ మాఫియాలు, నేరగాళ్ల పట్ల సానుభూతి చూపుతోందని సీఎం యోగి ఆరోపించారు .

జీవితం అంతా రాష్ట్ర సేవలో, అయోధ్య సేవలో గడిపిన కళ్యాణ్ సింగ్ మరణంపై సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలపకపోవడంపై సీఎం యోగి మండిపడ్డారు. కానీ, ఆయన మరణంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రజలు మొసలి కన్నీరు కారుస్తుందని వ్యాఖ్యానించారు.  

అధికారంలో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాముడు, అయోధ్య రామ మందిరంపై అవాకులు చెవాకులు పేల్చారు. ఇప్పడు ఆ పార్టీలు  ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాయో.. అధికారం లేని ఆ పార్టీలు అలాగే గిలగిల కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో అత్యధికంగా 80 మంది ఎంపీలతో ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఏప్రిల్ 19న ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసింది. ఆ తర్వాత మే 7, మే 13 ,మే 20, మే 23, జూన్ 1 తేదీల్లో ఐదు, ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. వరుసగా మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.  

Advertisement
Advertisement