Sakshi News home page

దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్‌ఎస్‌లో హైటెన్షన్‌

Published Wed, Aug 16 2023 7:26 PM

Medak: Who Will Next Incumbent Dubbak Constituency - Sakshi

దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్‌. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి.

దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు:

బీజేపీ పార్టీ:

  • మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే)

బీఆర్ఎస్ పార్టీ

  • కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత  మెదక్ ఎంపీ)

కాంగ్రెస్ పార్టీ: 

  • చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి  ముత్యం రెడ్డి కుమారుడు 
  • కత్తి కార్తీక
  • డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి

ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు:

  • దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి..
  • నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు.
  • మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు.
  • నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
  • ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు.
  • విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు.
  • ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
  • నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు.
  • దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు

Advertisement
Advertisement