బాలకృష్ణ, చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి..?: మంత్రి రోజా | Minister Rk Roja Sensational Comments On Nara Brahmani Over Chandrababu And Lokesh Scams - Sakshi
Sakshi News home page

బాలకృష్ణ, చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి..?: మంత్రి రోజా

Published Sat, Sep 30 2023 4:06 PM

Minister Rk Roja Comments On Nara Brahmani - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఊదరగొట్టుకుంటూ, పచ్చ ఛానెళ్లల్లో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు పేదల కోసం.. ఒక్క మంచి ఆలోచన అయినా చేశాడా..? అంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అదే మా నాయకుడు జగనన్న అతిచిన్న వయసులోనే పోరాడే యోధుడిగా నిలిచి, రాష్ట్రంలో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

‘‘ఆయన అంత చిన్నవయసులోనే ప్రజలకు ఏం కావాలో.. వారికి ఏ ఇవ్వాలో ఆలోచించి వారి సంక్షేమానికి, వారి ఆరోగ్యం కోసం జగనన్న సురక్ష పేరిట ప్రతి ఇంటి గడప దగ్గరకే వైద్యాన్ని తెచ్చిన మహనీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడి, షెల్‌ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు  ప్రజాధనం స్వాహా చేశాడు’’ అంటూ మండిపడ్డారు.

‘‘ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చొంటే, ఈరోజు ఆయన భార్య,కోడలు  బ్రాహ్మణి సిగ్గులేకుండా.. ప్రజలంతా గంటకొట్టి తమకు సంఘీభావం తెలపండని కోరతారా..?. బ్రాహ్మణికి బహుశా అసలు సైకోలు ఎవరో తెలియక ట్వీట్లు పెడుతున్నారనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద సైకోలెవరంటే, ఒకరు మీ నాన్న బాలకృష్ణ కాగా మరొకరు మీ మామ చంద్రబాబు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘మీ నాన్న, మీ మామకు అడ్రస్‌ కల్పించి, సమాజంలో గౌరవాన్ని అందించిన మీ తాత ఎన్టీ రామారావు గారిపై చెప్పులేసి.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి.. ఆయన పార్టీని లాక్కుని చివరికి ఆయన చావుకు కారణమైన పెద్దసైకోలెవరంటే.. అది బాలకృష్ణ, చంద్రబాబు అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. తప్పుచేసి, సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుకి పోయిన తర్వాత కూడా చంద్రబాబు కుటుంబం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం చాలా సిగ్గుచేటు. మరోసారి, సీఎం జగన్‌ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ట్వీట్‌లు పెట్టినా నారా బ్రాహ్మణికి మర్యాద దక్కదు. మీరు ఇలాగే నీచమైన మాటలతో ప్రజల్ని అమాయకుల్ని చేయాలనుకుంటే మిమ్మల్ని హైదరాబాద్‌కే పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ధిచెబుతారు’’ అంటూ మంత్రి రోజా హెచ్చరించారు.
చదవండి: మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ

Advertisement
Advertisement