అందుకే చంద్రబాబు, పవన్‌ భయపడుతున్నారు: మంత్రి వేణు

27 Jan, 2024 14:28 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కుల గణనపై పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని, అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి మండిపడ్డారు.

‘‘రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది?. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం’’ అని మంత్రి  వేణు పేర్కొన్నారు.

సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు‌ ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.

‘‘15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. సీఎం జగన్‌ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

 ఇదీ చదవండి: పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్‌ మరో నాటకం 

whatsapp channel

మరిన్ని వార్తలు