చంద్రబాబుపై నందమూరి లక్ష్మీ పార్వతి సీరియస్‌ కామెంట్స్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై నందమూరి లక్ష్మీ పార్వతి సీరియస్‌ కామెంట్స్‌

Published Wed, Oct 4 2023 5:26 PM

Nandamuri Lakshmi parvathi Slams TDP Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలుగు భాష అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబుకి తాడిచెట్టుకి వచ్చినట్లు 75ఏళ్ళు వచ్చాయి ఏం ఉపయోగం. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్‌ను కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీ తానే తెచ్చామని చెప్పడం చంద్రబాబుకి అలవాటు.

ప్రభుత్వ ఖజానాని కూడా తన సొంత డబ్బులా అనుకుని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే రూ.371 కోట్లు, ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు. రాజధాని పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడు. అల్లుడి గురించి చెప్పాలంటే అత్తగారే చెప్పాలి కదా అని కామెంట్స్‌ చేశారు. 

కాగా, తాడేపల్లి గూడెంలో వైఎస్సార్‌ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్  కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు భాష అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ గ్రంథాలయ కమిటీ ఛైర్మన్‌ మండపాటి శేషగిరి రావు పాల్గొన్నారు. 

సీఎం జగన్‌తోనే సాధ్యమైంది..
ఈ సందర్బంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మాములు విషయం కాదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమైంది. విద్య, వైద్యం సరిగ్గా సమపాళ్లలో అందితేనే వ్యవస్థ బాగుంటుందని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం జగన్‌. గత ప్రభుత్వంలో 3000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో  సీట్లు ఫుల్‌ అవుతున్నాయి. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందొ అర్థం అవుతుంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన వ్యక్తి సీఎం జగన్‌.

175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు..
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. తండ్రి ఒక కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా ప్రతీ కుటుంబం కోసం వారిలో ఒక వ్యక్తిగా జగన్ ఆలోచిస్తున్నారు. టీడీపీలో కూడా 70 శాతం మంది మన ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రజలు తెలివైన వారు కాబట్టే 23సీట్లుతో గత ఎన్నికల్లో చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ 175కి 175 సీట్లలో గెలుస్తారు’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?

Advertisement
Advertisement