Narsapur Constituency Next Leader? Know Political History - Sakshi
Sakshi News home page

నర్సాపూర్ నియోజకవర్గంలో తదుపరి అభ్యర్థి ఎవరు?

Published Wed, Aug 2 2023 11:12 AM

Narsapur Constituencies Next Leader  - Sakshi

నర్సాపూర్‌ నియోజకవర్గం

నర్సాపూర్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిపై 38120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మదన్‌ రెడ్డికి 105465 ఓట్లు రాగా,సునీతకు 67345 ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన మదన్‌ రెడ్డి గతంలో ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచిన సిపిఐ నేత చిలుముల విఠల్‌ రెడ్డి కుమారుడు. కాగా ఓటమి తర్వాత సునీత లక్ష్మారెడ్డి కూడా టిఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. ఆమె గతంలో మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఇక్కడ నుంచి బిజెపి పక్షాన పోటీచేసిన ఎస్‌.గోపికి మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి.

సునీత మంత్రిగా వై.ఎస్‌., రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసి నేతలు ఎన్నికయ్యారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి ఎనిమిది సార్లు గెలుపొందితే, సిపిఐ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ టిడిపి ఒక్కసారి కూడా గెలవలేక పోయింది. రెండుసార్లు టిఆర్‌ఎస్‌ గెలుపొందింది. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాధరావు నర్సాపూర్‌లో మూడుసార్లు గెలిచారు.  జగన్నాధరావు శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. ఆయన అంజయ్య, భవనం, కోట్ల మంత్రి వర్గాలలోను సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు. డిప్యూటీ స్పీకరుగా కూడా కొంత కాలం వ్యవహరించారు.

నర్సాపూర్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

తప్పక చదవండి

Advertisement