మాట్లాడుతూనే.. స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ | Sakshi
Sakshi News home page

మాట్లాడుతూనే.. స్పృహ కోల్పోయిన నితిన్‌ గడ్కరీ

Published Thu, Apr 25 2024 5:34 PM

Nitin Gadkari Faints During Rally In Maharashtra - Sakshi

ముంబై: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన - సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన యవత్మాల్‌ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

 

గడ్కరీ భవిష్యత్‌పై ఊహాగానాలు
ఈ ఏడాది ప్రారంభంలో నాగ్‌పూర్ సిట్టింగ్‌ అభ్యర్ధిగా ఉన్న గడ్కరీని ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి కొనసాగిస్తుందా? లేదా? అనే అనుమానాలు రాజకీయంగా చర్చానీయాంశంగా మారాయి. కమలం అధిష్టానం గడ్కరి పేరు ప్రకటించకపోవడంపై ఆయన భవిష్యత్‌పై ఊగాహానాలు ఊపందుకున్నాయి. 

మా పార్టీలో చేరండి
ఆ సమయంలో మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాకరే..నితిన్‌ గడ్కరీని తమ పార్టీ శివసేనలో చేరండంటూ ఆహ్వానించారు. రెండు రోజుల క్రితమే గడ్కరీకి ఈ విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురవుతుంటే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీలో చేరండి. మీ గెలుపు ఖాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని మంత్రిని చేస్తాం అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఆ కొద్ది రోజుల తర్వాత నాగపూర్‌ లోక్‌సభ అభ్యర్ధిగా నితీన్‌ గడ్కరీ పేరు ప్రకటించింది బీజేపీ.  

పరిపక్వత లేని మాటలు
ఉద్ధవ్‌ ఠాక్రే తనని పార్టీలోకి ఆహ్వానించడంపై నితిన్‌ గడ్కరి స్పందించారు. ఠాక్రే మాటలు ‘పరిపక్వత లేని, హాస్యాస్పదంగా’ ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల టిక్కెట్ల కోసం బీజేపీ ఒక వ్యవస్థ ఉందని, నా ప్రత్యర్థి నా రాజకీయ జీవితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 

హ్యాట్రిప్‌పై కన్నేసిన గడ్కరీ
కాగా, లోక్ సభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలుగా బంఫర్ మోజారీటీతో గెలిచిన నితిన్ గడ్కరీ హ్యాట్రిక్‌పై కన్నేశారు. మహారాష్ర్టలోని నాగపుర్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న ఆయన..ఇక్కడ ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన.. కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ.. ధీమాగా చెబుతున్నారు.

 

Advertisement
Advertisement