Sakshi News home page

బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. హైదరాబాద్‌లో పోస్టర్ల వార్‌

Published Sat, Sep 16 2023 11:14 AM

Political Posters War Between Congress And BRS In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా హస్తం నేతలంతా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్ల వార్‌ చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. 

సీడబ్య్లూసీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్‌ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్‌ వర్కింగ్‌ కమిటీ అంటూ రాజధాని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, వారు పాల్పడిన కుంభకోణాలకు సంబంధించిన వివరాలను వాటిలో పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు అంటించారు. ఈ సందర్భగా స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి (బివేర్ ఆఫ్ స్కామర్స్) అంటూ టాగ్ లైన్‌తో గుర్తుతెలియన వ్యక్తులు పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీంతో, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 

ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌పై కూడా పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ఫొటోతో ఓ స్కానర్‌ను రూపొందించారు. దీనిపై బుక్‌ మై సీఎం.. డీల్స్‌ అవాలబుల్‌.. 30 శాతం కమీషన్‌ అని రాసుకొచ్చారు. దీంతో, ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, రెండు పార్టీలకు చెందిన పోస్టర్లు అంటించడంపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ.. హస్తం నేతలు బిజీబిజీ 

Advertisement

తప్పక చదవండి

Advertisement