ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం | Ponguleti Meets Tummala Twist In Khammam Politics - Sakshi
Sakshi News home page

ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ‘నేను, తుమ్మల ఒకేకోవలోకి వస్తాం’: పొంగులేటి

Published Sat, Sep 2 2023 11:17 AM

Ponguleti Met Thummala Twist In Khammam Politics - Sakshi

తుమ్మలకు(తుమ్మల నాగేశ్వరరావు) అపారమైన అనుభవం ఉంది. ఏ పార్టీలో ఉన్నా చిత్తశుధ్దితో పని చేస్తారు. కానీ, పొమ్మనకుండా పొగ బెట్టారు. అనేక అవమానాలకు గురి చేసి బయటకు పంపిస్తున్నారు.   ముందు నన్ను అవమానించి బయటకు పంపారు. ఇప్పుడు తుమ్మలను అలాగే పంపిస్తున్నారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. ప్రజల కోరిక మేరకే తుమ్మల నిర్ణయం తీసుకుంటారు.
::మీడియాతో పొంగులేటి 

ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా ముఖ్యనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. నిన్న(గురువారం) రేవంత్‌రెడ్డి తుమ్మల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై తుమ్మల ఖమ్మం వెళ్లిపోయారు.

ఒకే పార్టీలో ఉన్నా..
అయితే ఊహించని విధంగా  శుక్రవారం తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగేటి.. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆయన ఆహ్వానం పలికినట్లు స్పష్టం అవుతోంది.  తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు.  అదీ.. బీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది.

తుమ్మల కామెంట్లు..
పొంగులేటి నా శ్రేయోభిలాషి. నన్ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు.  నా రాజకీయాలు ప్రజల కోసమే. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దేవుడు నాకు కల్పించాడు.  ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం.  సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నా. అభిమానుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటా.

ఇదీ చదవండి: తుమ్మలగారు.. మా పార్టీలోకి రండి 

Advertisement
Advertisement