ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం

Published Mon, Mar 6 2023 1:38 AM

Ponguleti Srinivasa Reddy Comments on CM KCR - Sakshi

తిరుమలాయపాలెం: రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చి న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రస్తు తం అందరి ముందున్న లక్ష్యమని, జెండా ఏదైనా అజెండా ఒక్కటేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆదివారం నిర్వహించిన పాలే రు నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

నిధులు, నీ ళ్లు, నియామకాలు అని చెప్పి అధికారంలో కి వచ్చారని, రాష్ట్రంలో నేడు అప్పులు, రైతులు, యువత ఆత్మహత్యలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.  20కి మించి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించిన గ్రా మం ఉంటే చూపించాలని పొంగులేటి సవాల్‌ విసి రారు. 36.86 లక్షల మంది రైతుల్లో 5.86 లక్షల మందికే రుణమాఫీ చేశారని, ఇంకా 31 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని, బడ్జెట్‌లోనూ దానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు.

రూ.19,600 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఆరేళ్లలో రూ.6,200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా రూ.13 వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందని, సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతామన్న పెద్దమనిషి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయ డంలో కేసీఆర్‌ దిట్ట అన్నారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్, డీసీసీబి డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement