ఆ డ్యామ్‌కు మేమూ వ్యతిరేకం: పుదుచ్చేరి బీజేపీ

19 Jul, 2021 17:27 IST|Sakshi

సాక్షి, చెన్నై: మేఘదాతులో డ్యాం నిర్మాణానికి తాము వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ ప్రకటించింది. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రధానిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ పుదుచ్చేరి అధ్యక్షుడు స్వామినాథన్‌ ఆదివారం ప్రకటించారు. కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మాణం కోసం కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, బీజేపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  

ఇదిలా ఉంటే... పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ సైతం డ్యాంకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో తామూ వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు స్వామినాథన్‌ ప్రకటించడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. కావేరి జలాలపై పుదుచ్చేరికి సైతం హక్కులు ఉన్నాయని, ఇక్కడి రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేఘదాతులో డ్యాంను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు