రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..

25 Dec, 2022 09:38 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు కేంద్ర సామాజిక న్యాయ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలే. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ ఆయనను ప్రధాని చేయాల్సిందని పేర్కొన్నారు. సమయం దాటిపోయిందని, ఇక రాహుల్ ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని అథవాలే అన్నారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని అథవాలే చెప్పారు. ఆయన స్థానాన్నీ భర్తీ చేసే నాయకుడే లేరన్నారు. రాహుల్ గాంధీకి అది సాధ్యం కాదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ 400 స్థానాలకుపైగా కైవవం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రాహుల్ ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని అథవాలే అన్నారు. కేరళ ప్రజలు ఆదరించకపోయి ఉంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని 15 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు.
చదవండి: భారత్‌ జోడో యాత్రలో కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు