పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు.. ఆస్పత్రిలో చేరిన రాజస్థాన్‌ సీఎం

27 Aug, 2021 12:24 IST|Sakshi

Ashok Gehlot Hospitalized: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన్ని జైపూర్‌ సవాయి మాన్‌సింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డెబ్భై ఏళ్ల వయసున్న గెహ్లోట్‌..  కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురికాగా.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు . పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలున్న ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నట్లు సమాచారం. 

తన ఆరోగ్య స్థితిగతులపై స్వయంగా అశోక్‌ గెహ్లోట్‌ శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేయడం విశేషం. ప్రస్తుతం తనకు బాగానే ఉందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో గెహ్లోట్‌ ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు.

చదవండి: కేజ్రీవాల్‌ను కలిసిన సోనూసూద్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు