ఎన్నికల వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక

Published Fri, Sep 15 2023 2:56 AM

Report on election strategy in 10 days says Prem Sagar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే ధ్యేయంగా అనుసరించాల్సిన వ్యూహంపై 10 రోజుల్లో నివేదిక ఇస్తామని టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌సాగర్‌రావు చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సభ్యులు కె. లక్ష్మా రెడ్డి, పాల్వాయి స్రవంతి, లోకేశ్‌ యాదవ్‌ తదితరు లు పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, బీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలు, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన మేలు గురించి ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించేలా పార్టీ వ్యూహాన్ని తయారు చేస్తామని చెప్పారు. 

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ చార్జిషీట్లు
తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనా వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో చార్జిషీట్లు విడుదల చేయాలని, రాష్ట్ర స్థాయిలో వేసే చార్జిషీట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మినీ చార్జిషీట్‌లు వేయాలని టీపీసీసీ చార్జిషీట్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కమిటీ చైర్మన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ చార్జిషీట్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సంపత్‌ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, ఈ అంశాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. స్థానికంగా ఎమ్మెల్యేల అరాచకాలను ఈ చార్జిషీట్లలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని సంపత్‌ వెల్లడించారు. 

మండలాల వారీగా డేటా సేకరణ
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రీసెర్చ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని, అన్ని కోణాల్లో మండలాల వారీగా డేటా సేకరించి ప్రజలకు అవసరమైన కార్యకలాపా లు చేపట్టేలా పార్టీకి తగిన సమాచారం అందించాలని టీపీసీసీ కమ్యూనికేషన్స్‌ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్‌ జెట్టి కుసుమకుమార్‌ అధ్య క్షతన గురువారం గాంధీభవన్‌లో సమావేశం జరి గింది. అనంతరం కుసుమకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ తరహాలోనే గాంధీభవన్‌ లోనూ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement