‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్‌’.. ఎంపీ శశి థరూర్‌ విమర్శలు | Sakshi
Sakshi News home page

‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్‌’.. ఎంపీ శశి థరూర్‌ విమర్శలు

Published Wed, Feb 7 2024 8:38 PM

Shashi Tharoor Slams centre Over NDA Means No Data Available - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదల సంక్షేమన్ని మర్చిపోయిందని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలకు శశి థరూర్‌ తప్పుపట్టారు. 

‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్‌. గత పదేళ్లలో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ధనవంతులకు ఖర్చు చేస్తే.. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారని కేంద్రం అనుకుంటుంది.

.. ఆర్థిక వ్యవస్థలో అందరూ భాగస్వాములు కావాలి. కానీ, కేంద్రం అలా చేయకుండా కేవలం మూల ధన వ్యయంపైనే దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థ, పేదవారిపై ఈ బడ్జెట్‌ ఏ ప్రభావం చూపదు. ఈ విషయాన్ని లోక్‌సభ గ్రహించాలి’ అని శశిథరూర్‌​ అన్నారు.

Advertisement
Advertisement