కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు | Sakshi
Sakshi News home page

కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు

Published Sun, May 5 2024 1:10 PM

Shock To Chandrababu, CEO directs CID to probe False propaganda on Land Titling Act

ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద మాట్లాడితే  చర్యలు తీసుకోండి.

సీబీసీఐడీకి ఎన్నికల సంఘం ఆదేశం

కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.

కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. 

ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.

-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement