‘మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు’

4 Nov, 2020 14:51 IST|Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, తాడేపల్లి :  రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎలక్షన్‌ కిమషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే తాము చేస్తున్నామని, ఎవరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌ రెడ్డి మట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్‌ఈసీ  నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్ హైకోర్టులో నిన్న(మంగళవారం) అఫిడవిట్ వేసినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. హైకోర్టుకు  నిన్ననే ఈసీ నివేదించినట్లు పత్రికల్లో వచ్చిందని, హైకోర్టులో మాత్రం ఆ అఫిడవిట్ ఈ రోజు ఫైల్ అయినట్లుగా ఉందని పేర్కొన్నారు. ముందుగానే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు లీక్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలని నిలదీశారు. ఈ విషయంతో చంద్రబాబు ఆదేశాలతో నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: ఏపీలో పనిచేస్తూ.. హైదరాబాద్‌లో నివాసమా!

సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. అఫిడవిట్ సంబంధించిన రిపోర్టులను ముందుగానే ఎందుకు పత్రికలకు ఇచ్చారుని ప్రశ్నించారు. రెండు కేసులు వచ్చి నపుడు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పడు సరాసరిగా ౩ వేల కరోనా కేసులు రోజుకు వస్తున్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, రాజ్యాంగ  వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లుగా  ఎస్ఈసీ రమేష్ పని చేస్తున్నారన్న శ్రీకాంత్‌ రెడ్డి  స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లోంచి బయటకు రాని నాయకుడు చంద్రబాబు. జూమ్ మీటింగ్‌లలో ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. చదవండి: 'ప్రతీది వక్రీకరించటం చంద్రబాబుకు అలవాటే'

‘మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమీ చేయడం లేదు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ది శూన్యం. అమరావతిలో చంద్రబాబు అడుగుకు 12వేలు దోచుకుని సర్వనాశనం చేశారు. విజయవాడలో దుర్గ వారధిని కూడా కొద్దిగా చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట చంద్రబాబు  వేల కోట్లు దోచుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వం 800 కోట్లను మిగిల్చింది. కాంట్రాక్టులు, కమిషన్లు  కక్కుర్తి కోసం కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారు. పేదలకు 30లక్షల పట్టాలు రాకుండా చేసింది చంద్రబాబే ఇప్పుడేమో అర్హులతో ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వైపు తప్పులు ఉంటే  మేము సరి చేసుకుంటాం. కులాలు మతాల మధ్య తగాదాలు పెట్టింది తెదేపానే. ఒట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దుగజారుతారు. సంక్షేమ పథకాలపై ఎక్కడైనా సరే చర్చించేందుకు మేము సిద్దం’ అని పేర్కొన్నారు.  రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం 

మరిన్ని వార్తలు