ఆ విషయం కరుణానిధికి కూడా తెలుసు: సీఎం

23 Mar, 2021 14:01 IST|Sakshi

– సీఎం పళనిస్వామి 

సాక్షి, చెన్నై : తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదని, ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి జిల్లాలో పళనిస్వామి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. హోసూరులో అన్నాడీఎంకే అభ్యర్థి జ్యోతి బాలకృష్ణారెడ్డికి మద్దతు నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అమ్మ పథకాలు అమలవ్వాలంటే రెండాకులను గెలిపించుకోవాలని కోరారు.

స్టాలిన్‌ సమర్థుడు కాదనే విషయం కరుణానిధికి కూడా తెలుసని, అందుకే ఆయన చేతికి అధికారం ఇవ్వకుండా చివరి క్షణం వరకు తన వద్దే ఉంచుకున్నారన్నారు. స్టాలిన్‌ను తండ్రే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అనంతరం పాలక్కోడులో మంత్రి అన్బళగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి రాకేష్‌కుమార్‌ తరఫున ప్రచారం నిర్వహించారు.  

ఏపీఎస్‌ తప్పని సెగ 
తిరువణ్ణామలై పర్యటన ముగించుకుని ధర్మపురి వెళుతున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చెన్నై – సేలం గ్రీన్‌ వే వ్యవహారంలో పళని స్వామి వైఖరికి నిరసనగా  రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. 

చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి!
అడ్డదారిలో సీఎం కాలేదు.. 

మరిన్ని వార్తలు