సీఎం రమేష్‌ రౌడీయిజం! | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్‌ రౌడీయిజం!

Published Mon, Apr 8 2024 8:38 AM

TDP Alliance MP Candidate CM Ramesh Rowdyism In Chodavaram - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ మాజీ నేత, బీజేపీ ప్రస్తుత నేత సీఎం రమేష్‌ తన మార్క్‌ రౌడీ రాజకీయాలకు తెరతీశారు. అనకాపల్లి జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు నిర్వహించకుండా ముందస్తుగానే అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల వద్దకు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ ప్రశి్నస్తున్నారు. ఎదురుదాడికి మించిన ఆత్మరక్షణ లేదనే ధోరణితో ఎన్నికల్లో తాము చేసే అక్రమాలకు అడ్డురాకూడదనే ఆలోచనతో ఈ తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఇప్పటికే అనకాపల్లిలోని లాడ్జీల్లో కడప నుంచి వచ్చిన అనుచరులు మకాం వేసి హల్‌చల్‌ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుతో తనకున్న పాత పరిచయాలతో ఇద్దరూ కలిసి నోటికి పనిచెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నకు భారీ ప్యాకేజీని సీఎం రమేష్‌ అందించారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో తాము చేసే విచ్చలవిడి అరాచకాలకు అడ్డులేకుండా చూసుకునేందుకే.. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకట్ట వేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సీఎం రమేష్‌ రాకతో అలజడి ప్రారంభమైంది. 


ఈనెల 6వ తేదీన నర్సీపట్నంలో చీరల పంపిణీని అడ్డుకున్న పోలీసులపై చిందులేస్తున్న కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్‌  

కోతికి కొబ్బరి చిప్ప! 
అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇష్టారీతిలో చెలరేగి అధికారులపై మాటల దాడికి దిగుతున్నారు. ఇప్పుడు కల్లు తాగిన కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా... ఈయనకు కాస్తా సీఎం రమేష్‌ జతకలిశారు. దీంతో నోటికి అదుపులేకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం చోడవరంలోని ఒక షాపులో పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు వస్తే.. వెంటనే సీఎం రమేష్‌ రంగంలోకి దిగారు. అధికారులు తనిఖీలు చేయవద్దంటూ అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు దిగారు. తాజాగా నర్సీపట్నంలో నోట్లు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచేందుకు కూటమి చేసే ప్రయత్నాలపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. వెంటనే ఒకవైపు సీఎం రమేష్‌... మరోవైపు అయ్యన్నపాత్రుడులు అధికారులపై మాటల దాడికి దిగారు. తనిఖీలు ఎలా చేస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

చీఫ్‌ సెక్రటరీ, డీజీపీపై పరుష వ్యాఖ్యలు
ఇక అయ్యన్న ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలు వెధవలు అంటూ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులు తనిఖీలకు వస్తే అభ్యర్థులు సహకరించడం సహజం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఇద్దరూ అడ్డగోలుగా అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే బెదిరింపుల ద్వారా లబ్ధి పొందేందుకు ఆ ఇద్దరూ ప్రయతి్నస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

లాడ్జీల్లో మకాం! 
స్థానికంగా కనీసం ఒక్క ఓటరూతోనూ పరిచయం లేని సీఎం రమే‹Ù... కేవలం రౌడీయిజం ద్వారానే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలోని లాడ్జీల్లో ఇప్పటికే 200 మందికిపైగా తన అనుచరులు మకాం వేశారు. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసే వరకూ అనకాపల్లిలోని లాడ్జీలను బుకింగ్‌ చేసుకున్నారు. కౌంటింగ్‌ వరకూ ఇక్కడే మకాం వేసి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మరోవైపు మొదటగా సీఎం రమేష్‌ నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ, జనసేన నాయకులను కలిసి తమకు సహకరించాలంటూ భారీగానే ప్యాకేజీని ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీఎం రమేష్‌ రాక సందర్భంగా హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.   

అయ్యన్నకు నోట్ల కట్టలు? 
ఇన్నాళ్లూ అనకాపల్లి ఎంపీ సీటు స్థానికుడికి ఇవ్వాలని హడావుడి చేసిన అయ్యన్న.. సీఎం రమేష్‌ విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడడంలేదు. పైగా అయ్యన్ననే వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే అయ్యన్నకు ప్యాకేజీ ముట్టిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు రౌడీయిజం.. మరోవైపు నోట్ల కట్టల ద్వారా ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు సీఎం రమేష్‌ చేస్తున్న ప్రయత్నాలపై అనకాపల్లి జిల్లాలో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో వీరి రాకతో రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న ఓటర్లు అందరివాడు, సౌమ్యుడు బూడి ముత్యాలనాయుడుతో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

చోడవరంలో కేసు నమోదు 
జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం (డీఆర్‌ఐ) అధికారుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసినందుకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమే‹Ù, టీడీపీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు చోడవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పాటు కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ధిక్కరించడం, విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.  శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు.  

Advertisement
Advertisement