టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ ఫ్లాప్‌ | TDP And Janasena Alliance Utter Flop: Minister Ambati Rambabu - Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ ఫ్లాప్‌

Published Mon, Sep 18 2023 5:43 AM

TDP and Jana Sena alliance utter flop - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన పొత్తును తట­స్థులే కాదు.. జనసేన కార్యకర్తలు కూడా వ్యతిరేకి­స్తు­న్నా­రని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని తేల్చిచెప్పారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానేనంటూ చంద్రబాబు, పవన్‌­కళ్యాణ్‌­ల కలయికను ఎద్దేవా చేశారు. తాడే­పల్లిలోని వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో ఆది­వారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లా­డుతూ.. అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వ ఖజానాను దోచేస్తూ.. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగ చంద్రబాబు స్కిల్‌ స్కాంలో దొరికిపోయి జైలుపాలు కావడంతో ఇన్నాళ్లకు ధర్మం, న్యాయం గెలిచిందని ప్రజలు హర్షిస్తున్నా­రని చెప్పారు.

చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పొంది, తద్వారా రాజకీయంగా లబ్ధి­పొందాలనే నెపంతో టీడీపీ నేతలు కృత్రిమంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు స్పందించడంలేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన ప్రాణం తీయగలడేమోగానీ టీడీపీకి ప్రాణం పోయలేడంటూ సెటైర్లు వేశారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల హృదయాలను గెలుచుకు­న్నా­రని.. ఆ ప్రజాబలంతోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జన­సేనలను బంగాఖా­ఖాతంలో కలిపి తిరుగులేని విజయం సాధిస్తారని తేల్చిచెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

  • టీడీపీ–జనసేన పొత్తు నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకున్నామని పవన్‌ చెప్పడం పచ్చి అబద్ధం. తొలి నుంచి వారు కలిసే వస్తారని మేం చెబుతు­న్నాం. అదే నిజమైంది. 
  • రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నైతిక విలువల్లేనివాడు, నమ్మకూడని వ్యక్తి పవనే. బీజేపీతో పొత్తులో ఉంటూ ఆ పార్టీకి చెప్ప­కుండా టీడీపీతో పొత్తు ప్రకటించడం హేయం.  
  • పోటీచేసిన రెండుచోట్ల ఓడి.. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్న నువ్వెక్కడ? ప్రజా­బలంతో 151 సీట్లను గెలుచుకున్న సీఎం జగన్‌ ఎక్కడ? నువ్వెంత? నీ స్థాయి ఎంత పవన్‌? సీఎం జగన్‌పై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు.
  • ఎంపీడీ (మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌) అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న నువ్వా  సీఎం జగన్‌పై మాట్లాడేది. మనోహర్‌ కొంగు పట్టుకుని సముద్రంలో కలవడం ఖాయం. 

Advertisement
Advertisement