చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ

28 Sep, 2020 14:30 IST|Sakshi

రామచంద్రపై దాడిచేసింది టీడీపీ వ్యక్తే

వివరాలు తెలిపిన ఎస్పీ సెంథిల్‌కుమార్‌

లబ్ది కోసం తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడి

సాక్షి, చిత్తూరు: సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర (45) దాడి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. రామచంద్రపై దాడి చేసింది మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అని దుష్ప్రచారానికి తెరతీసిన ఎల్లో మీడియా బండారం బయటపడింది. దాడిలో పాల్గొన్నది టీడీపికి చెందిన ప్రతాప్‌రెడ్డి అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ప్రతాప్‌రెడ్డి పోలీసులకు చెప్పారు. జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ కేసు వివరాలను మీడియా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశారు. మాజీ జడ్జి సోదరుడు రామచంద్ర మీద దాడి చేసింది టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డినే. దాడికి సంబంధించి పక్కా ఆధారాలు లభించాయి. రాజకీయ లబ్ది కోసం తప్పుడు ఫిర్యాదులు చేశారు’అని ఎస్పీ పేర్కొన్నారు.
(చదవండి: దారి ఘటనలో రాజకీయం లేదు)

కాగా, మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై బి.కొత్తకోట బస్టాండు వద్ద ఆదివారం సాయంత్రం దాడి జరిగింది. దారి ఇచ్చే విషయంలో పండ్ల వ్యాపారి శ్రీనివాసులు ప్రతాప్‌రెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే సమయంలో శ్రీనివాసులు వద్ద పండ్లు కొంటున్న రామచంద్ర జోక్యం చేసుకోవడంతో ఘర్షణ జరిగింది. శ్రీనివాసులుకు మద్దతుగా మాట్లాడిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేయడంతో మొహం, భుజాలపై గాయాలయ్యాయి. బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక గొడవ జరిగినప్పుడు మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర మద్యం సేవించి ఉన్నట్టు తెలిసింది. రామచంద్ర మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(చదవండి: కుప్పంలో టీడీపీ నేతల దౌర్జ‌న్యం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా