దళితబంధుపై సంపూర్ణ అధికారం ఉండాలి  | Sakshi
Sakshi News home page

దళితబంధుపై సంపూర్ణ అధికారం ఉండాలి 

Published Sun, Dec 5 2021 5:01 AM

Telangana: Huzurabad MLA Etela Rajender Comments On Dalit Bandhu - Sakshi

తిరుమలగిరి (తుంగతుర్తి): దళితబంధు పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలపై దళితులకు సంపూర్ణ అధికారం ఉండాలని మాజీమంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కోరారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఇల్లందుకు వెళ్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రూ.10 లక్షలతో దళితులు ఏ బిజినెస్‌ చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని, దీనిపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం ఉండొద్దని అన్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. దళితబంధు పథకంలో భాగంగా గేదెల స్కీం పెట్టి ఇక్కడి వారిని హరియాణాకు పంపిస్తే అక్కడ రూ.2 లక్షల విలువైన గేదెకు రూ.4.50 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గొర్రెల పథకంలో భాగంగా ఇక్కడి రైతులు కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లి గొర్రెలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయా న్ని ఈటల గుర్తుచేశారు.

తిరుమలగిరి మండ లంలో ప్రతీఒక్క దళిత కుటుంబానికి వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి రామచంద్రయ్య, జిల్లా అధికార ప్రతినిధి దీన్‌దయాళ్‌ పాల్గొన్నార 

Advertisement
Advertisement