ఈటల వ్యవహారంపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ

16 Jun, 2021 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంపై తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఘాటు లేఖ రాశారు. ఈటల రాజీనామాను తమ పార్టీ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు... ‘‘కేసీఆర్‌- ఈటల మధ్య వ్యవహారం తెలంగాణ ప్రజలకు సంబంధించినది కాదు. కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ ఒకే గూటి పక్షులు. ప్రజల ఆకాంక్షలకు కేసీఆర్‌, ఈటల తూట్లు పొడిచారు. ఈటల తన ఆస్తుల పెంపుదల కోసం ప్రయత్నించారు. పేదల భూములను ఈటల అక్రమంగా ఆక్రమించారు’’ అని జగన్‌ ఆరోపించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని చెప్పిన ఈటల.. తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరారంటూ విమర్శించారు.

చదవండి: క్షేమంగా ఇంటికి చేరిన ఈటల

మరిన్ని వార్తలు