ఆ ముఖ్యమంత్రిని చూసి బుద్ధితెచ్చుకో కేసీఆర్‌.. కోమటిరెడ్డి హితవు | Sakshi
Sakshi News home page

MP Komatireddy Venkat Reddy: ఆ ముఖ్యమంత్రిని చూసి బుద్ధితెచ్చుకో కేసీఆర్‌.. కోమటిరెడ్డి హితవు

Published Sun, Nov 7 2021 1:03 AM

Telangana: MP Komatireddy Venkat Reddy Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో వరి క్వింటాల్‌కు రూ.1,900 మద్దతు ధరకు తోడు రూ.750 కలిపి కొంటున్నారని, అక్కడ సీఎం రైతుల మీద చూపిస్తున్న చొరవను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ బుద్ది తెచ్చుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో మాత్రం రైతులు క్వింటాల్‌కు రూ.1,300–1,400 లెక్కన అమ్ముకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కనీసం ధాన్యం కొనే దిక్కు లేక రోజుల తరబడి నిరీక్షిం చి ధాన్యం కుప్పలపైనే చనిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు దీపావళి పండుగ కూడా చేసుకోకుండా ఉపవాసాలు ఉండి ధాన్యం అమ్ముకుంటున్నా డని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కామారెడ్డి జిల్లాకు చెందిన దళిత రైతు ధాన్యం కుప్ప మీదే ప్రాణం విడిచాడన్నారు. వారం రోజుల్లో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేం ద్రం ఏర్పాటు చేయాలి.. లేకుంటే జాతీయ రహదారులను ముట్టడిస్తామని హెచ్చరించారు.  

గెలుపోటములు సహజం: ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా హుజూరాబాద్‌లో గెలవలేదనే బాధలో సీఎం కేసీఆర్‌ ఉన్నారేమోనని ఎద్దేవా చేశారు. ఇప్పుడైనా బయటకొచ్చి ధాన్యం కొనుగోళ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం పండిందని, ఆ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేస్తే రైతులకు రైతుబంధు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

వడ్ల కొనుగోలుపై మంత్రి కేటీఆర్‌ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. తాను వడ్ల కొనుగోలు గురించే మాట్లాడుతానని, రాజకీయాలను ప్రస్తావించనని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా ఎప్పు డూ తనకు దేవతనేనని.. కేసీఆర్‌లాగా ఒకసారి దేవత, ఇంకోసారి దయ్యం అని తాను మాట్లాడలేనని చెప్పారు. బద్వేల్‌లో తమకు 6 వేల ఓట్లు వస్తే ఇక్కడ 3 వేలు వచ్చాయని, ఇలాం టి పరిస్థితుల్లో పార్టీని ఎలా బతికించాలో ఆలోచిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.

కాగా, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో తీసుకున్న నిర్ణ యం మేరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో మాట్లాడే బాధ్యత తీసుకున్న మాజీ ఎంపీ వీహెచ్‌ ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేశారు. వెంకటరెడ్డితో చాలాసేపు మాట్లాడిన ఆయన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండటం మంచిది కాదని, అందరం కలసి పనిచేద్దామని కోరినట్లు మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement