మున్సిపల్‌ ఎన్నికలు యథాతధం: ఎస్‌ఈసీ | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికలు యథాతధం: ఎస్‌ఈసీ

Published Thu, Apr 22 2021 5:31 PM

Telangana SEC Clarifies Muncipal Elections 2021 Conduct On Declared Date - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని సూచిందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. ‘‘ఈనెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు. 

కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని ... ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. 

చదవండి: మున్సి‘పోరు’: టీఆర్‌ఎస్‌ సరికొత్త రాజకీయం

Advertisement
Advertisement