Morning Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

31 Oct, 2022 10:12 IST|Sakshi

1. ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు.. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
మునుగోడు నియోజకవర్గంలోని బ్యాంకు ఖాతాలకు రూ.5.24 కోట్ల బదిలీకి సంబంధించి వివరణ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏపీలో మారుతున్న రాజకీయం! టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఏంటి?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో  పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పలకని పవన్‌.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే !
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ షేక్‌ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్‌ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా?
మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ట్విటర్‌లో ఉద్యోగాల కోతలు షురూ
మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ .. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విభాగాలను భారీగా కుదించడంపై దృష్టి పెట్టారు.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం
టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్‌ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?
నటుడు, నిర్మాతగా బిజీగా ఉన్నా విశాల్‌పై తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంది. అయితే ఇలాంటి వదంతులు ఆయనకు కొత్తేమీ కాదు. స్టార్‌ హీరోగా రాణిస్తున్న విశాల్‌ చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు