కేసీఆర్‌ పర్యటనలో తుమ్మల.. మళ్లీ జిల్లాలో కీలకంగా మారబోతున్నారా?

12 Jan, 2023 17:55 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో.. మంత్రి హరీష్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయనే చెప్పాలి. ఇవాళ కొత్తగూడెం సీఎం సభ కేసీఆర్ సభకు మాజీ మంత్రి తుమ్మల హాజరయ్యారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడే అవకాశం ఉండటంతో తుమ్మల కూడా పార్టీ వీడితే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీ నుంచి వెళ్లకుండా బీఆర్‌ఎస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు తాజా రాజకీయ సమీకరణాలు బట్టి చూస్తే తెలుస్తుంది. చర్చలు సానుకూలంగా సాగడంతో ఖమ్మంలో తుమ్మల మళ్లీ కీలకంగా మారబోతున్నారనే చర్చ నడుస్తోంది.

చదవండి: (తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు