తెలంగాణలో హంగ్‌.. సర్కార్‌ ఏర్పాటుపై లాజిక్‌ చెప్పిన రేవంత్‌ | Sakshi
Sakshi News home page

తెలంగాణలో హంగ్‌.. సర్కార్‌ ఏర్పాటుపై లాజిక్‌ చెప్పిన రేవంత్‌

Published Sat, Oct 7 2023 7:40 PM

TPCC Revanth Reddy Interesting Comments Over TS Elections - Sakshi

సాక్షి, సికింద్రాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌ అపూర్వ సోదరులు అంటూ చురకలంటించారు. అలాగే, డిసెంబర్‌ నెల మిరాకిల్‌ మంత్‌ అని.. తెలంగాణ వచ్చింది అదే నెలలో..రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది అదే నెలలో అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, రేవంత్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి. కానీ, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించింది. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. మైనార్టీల డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా నిలవండి.

ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హాంగ్ వస్తుందని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసు. హాంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్‌ఎస​ పార్టీలే. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్.. సోనియా గాంధీని దూషిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీని నిందిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలది ఫెవికాల్‌ బంధం. మరి ఎంఐఎం పార్టీ.. కాంగ్రెస్‌ను ఎందుకు దూషిస్తోంది. పదవులు త్యాగం చేసినందుకా?.. దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా?. తెలంగాణలో కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్‌లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదు.

తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవి. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. 2023 డిసెంబర్‌ నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజలకు బుద్ది చెప్పాలి. సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: రేవంత్‌ సినిమా మొత్తం మా దగ్గరుంది.. ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement