Maharashtra Politics: సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్‌ ఠాక్రే.. రాజ్‌ ఠాక్రే!

9 Aug, 2023 09:13 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (చీఫ్‌) రాజ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్‌ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్‌ఠాక్రేకి ఫోన్‌ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు.

కాగా.. రాజ్‌–ఉద్ధవ్‌లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? 
రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్‌నాథ్‌ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి.

ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్‌ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ వర్గం నుంచి అజిత్‌ పవార్‌ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్‌–ఉద్ధవ్‌) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు.  

బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు..   
బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్‌ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్‌స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్‌ను బీజేపీకి మరింత దగ్గర చేసింది.

ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌ శిందే, చంద్రకాంత్‌ పాటిల్‌సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్‌ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్‌లోని రాజ్‌ఘడ్‌కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్‌ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్‌

పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి.  
ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే.. బాల్‌ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్‌ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉద్ధవ్‌తో మైత్రికి ప్రయత్నాలు.. 
అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్‌ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు.

అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్‌కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్‌ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్‌ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్‌ భావించారు.  

మరిన్ని వార్తలు