వర్ధన్నపేటలో అసమ్మతి సెగ! | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేటలో అసమ్మతి సెగ!

Published Wed, Aug 23 2023 3:25 PM

Warangal: Who Will Next Incumbent in Wardhannapet West Constituency - Sakshi

వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం.

ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : 

  • నిరుద్యోగ సమస్య. 
  • సీసీ, బిటి రోడ్లు పూర్తీ స్ధాయిలో లేవు.
  • తీవ్రంగా వేదిస్తున్న డ్రైనేజీ సమస్య.
  • త్రాగు నీరు సమస్య.
  • ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 8 మండలాల్లో రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మించారు. 
  • ధరణి వల్ల భూ సమస్యలు. 

ప్రధాన పార్టీల అభ్యర్థులు :

బీఆర్ఎస్

  • ఆరూరి రమేష్ 

కాంగ్రెస్ 

  • కేఆర్ నాగరాజు మాజీ ఐపిఎస్ అధికారి
  • మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య 

బీజేపీ

  • కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మల్యే (కొత్త వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది)

నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :

వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం.

రాజకీయ అంశాలు :

వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉండగా మూడోసారి కూడా అధిష్టానం అతనికే టికెట్‌ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు.

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :

వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్, హన్మకొండ జిల్లాల చుట్టు ఉంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు వర్దన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నుంచి హసన్ పర్తి అటు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు విస్తరించి ఉంది. 
నదులు : వర్ధన్నపేట ఆకేరు వాగు, కోనారెడ్డీ, పర్వతగిరి రిజర్వాయర్.
పర్యాటకం : ఖిలా వరంగల్ కోట, ఐనవోలు, పర్వతగిరి అన్నారం షరీఫ్ దర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉన్న మామునూరు విమానాశ్రయం. 4th బెటాలియన్, రాష్ట్రంలోని ప్రధాన పోలిస్ ట్రైనింగ్ సెంటర్. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం, పర్వతగిరి. అన్నారం యాకుబ్ శావలి దర్గ 

Advertisement

తప్పక చదవండి

Advertisement