Who Will Win Next 2023 Elections In Medak Constituency? - Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో నారాయణ ఖేడ్‌ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది..!

Published Mon, Jul 31 2023 1:22 PM

Who Will Win Next Elections In Medak Constituency - Sakshi

నారాయణ ఖేడ్‌ నియోజకవర్గం

నారాయణ ఖేడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎమ్‌.భూపాల్‌ రెడ్డి రెండోసారి విజయం సాదించారు.2014 ఎన్నికలలో ఇక్కడ గెలిచిన పి.కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి భూపాల్‌ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్‌.పి సురేష్‌ షెట్కార్‌పై 58508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భూపాల్‌ రెడ్డికి 95550 ఓట్లు రాగా, సురేష్‌ షెట్కార్‌ కు 37042 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బిజెపి అభ్యర్ధిగా పి. సంజీవరెడ్డికి కాంగ్రెస్‌ ఐ అభ్యర్దితో దాదాపు సమానంగా 36వేలకు పైగా ఓట్లు లభించాయి.

ఆయన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు కావడం వల్ల ఓట్లు గణనీయగా వచ్చాయి.కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాకపోవడంతో బిజెపి పక్షాన పోటీచేశారు.రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి భూపాల్‌ రెడ్డి. 2014లో తెలంగాణలో టిఆర్‌ఎస్‌ గాలిని ఎదుర్కుని గెలిచిన కాంగ్రెస్‌ ఐ నేతలలో నారాయణ ఖేడ్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఒకరు. ఈయన టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎమ్‌.భూపాల రెడ్డిని 14786 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. 2014లో తెలుగుదేశం - బిజెపి కూటమి అభ్యర్ధిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌ రెడ్డికి 40405 ఓట్లు వచ్చాయి.

నాలుగోసారి శాసనసభకు ఎన్నికైన కిష్టారెడ్డి దివంగత సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బాగారెడ్డికి దగ్గర బంధువు అవుతారు. కిష్టారెడ్డి ఆ తర్వాత మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచెంది. నారాయణ ఖేడ్‌, అంతకుముందు సదాశివపేటలలో కలిపి ఏడుసార్లు రెడ్లు ఎన్నికైతే, ఏడుసార్లు షెట్కార్‌లు గెలుపొందారు. ఒకసారి ఎస్‌.సికి అవకాశం వచ్చింది. నారాయణ ఖేడ్‌లో  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి పదిసార్లు గెలవగా, టిడిపి రెండుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రెండుసార్లు టిఆర్‌ఎస్‌ గెలిచింది.

1972, 1983లో ఇక్కడ రెండుసార్లు గెలిచిన వెంకటరెడ్డి, 1994లో గెలిచిన విజయపాల్‌రెడ్డి తండ్రీ కొడుకులు. నారాయణఖేడ్‌లో రెండు సార్లు గెలిచిన అప్పారావు షేట్కర్‌, మూడుసార్లు నెగ్గిన శివరావుషేట్కర్‌, ఒకసారి గెలిచిన సురేష్‌కుమార్‌ షేట్కర్‌లు ఒకే కుటుంబానికి చెందినవారు.2009లో సురేష్‌ షెట్కార్‌ జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒకసారి  గెలుపొందారు.

నారాయణ ఖేడ్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement

తప్పక చదవండి

Advertisement