ఎంపీగా గెలిస్తే ఫారెన్‌ లిక్కర్‌ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం | Sakshi
Sakshi News home page

ఎంపీగా గెలిస్తే పేదలకు ఫారెన్‌ లిక్కర్‌ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం

Published Sun, Mar 31 2024 9:48 PM

Woman Contestant Interesting Poll Promise In Maharashtra Chandrapur - Sakshi

చంద్రాపూర్‌: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్‌. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్‌ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్‌.

అయితే ఈ స్కీమ్‌ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్‌ ఉండాల్సిందేనన్న కండీషన్‌ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్‌ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.

వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్‌ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్‌ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. 

ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి 

Advertisement
Advertisement