కేసీఆర్‌ కళ్లుమూసుకుని పరిపాలిస్తున్నారు: వైఎస్‌ షర్మిల 

14 May, 2021 05:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనతీరుపై వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. కరోనా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, కేసీఆర్‌ కళ్లు చెవులు మూసుకుని పరిపాలన చేస్తున్నారంటూ గురువారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకని పాలు తాగుతున్న చందంగా ఉందని ఆరోపిం చారు.

రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం జనం క్యూలు కట్టేది, రూ.3500 ఇంజెక్షన్‌ రూ.40వేలు పెట్టి కొంటున్నామన్న తెలంగాణ ప్రజల గగ్గోలు కేటీఆర్‌కి కనిపించట్లేదు వినిపించట్లేదని విమర్శించారు. తండ్రీ కొడుకులు గారడి మాటలు పక్కన పెట్టి బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ల కొరత ఉందని ఒప్పుకుని, వాటిని ఎలా అందించాలో ఆలోచించాలని షర్మిల సూచించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు