రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోంది: YSRCP | Sakshi
Sakshi News home page

రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోంది: YSRCP

Published Fri, Jan 19 2024 1:50 PM

YSRCP Leaders Serious Comments On Ramoji Rao - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈనాడులో రాసిన చెత్త రాతలపై వైఎస్సార్‌సీపీ మంత్రులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. కేవలం చంద్రబాబు కోసమే ఇలాంటి వార్తలు రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల ఈనాడు పేపర్‌ను చించివేసి, మంటల్లో వేసి దగ్ధం చేస్తున్నారు. 

పచ్చ మీడియా ఏడుపే.. ఏడుపు..

  • పచ్చ బ్యాచ్‌కు ఏదీ చాతకాదు.. ఇంకొకరు చేస్తే చూడలేరు. 
  • ఇదీ చంద్రబాబుకు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా!.
  • సీఎం జగన్‌ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. 
  • అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ లక్షలాది పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల ఇంటి పండుగ. 
  • పచ్చ బ్యాచ్‌ మీరు ఏడుస్తూనే ఉండండి.
  • మేము ఆ వర్గాలను ప్రగతిపథం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతాం: వైఎస్సార్‌సీపీ

మంత్రి అమర్నాథ్‌ సీరియస్‌

  • ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..?
  • మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పారు 
  • రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి
  • అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు.
  • ఈ వయసులో ఇదేం పాడు పని.. ఇవేం రోత రాతలు రామోజీ ..!?

జాలేస్తోంది.. యెల్లో మీడియాకు అంబటి చురకలు

  • బడుగు బాంధవుడి విగ్రహంపైనా పచ్చ మంద ఏడుపులు
  • జగన్‌కు అంబేడ్కర్‌ విగ్రహం తాకే అర్హత లేదంటూ కథనాలు
  • యెల్లో మీడియాకు వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌
  • ఎక్స్‌ వేదికగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చురకలు
  • డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్నారు 
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుంది.

పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతారు: కొడాలి నాని

  • అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా గుడివాడలో సంబరాలు
  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వేడుకల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.
  • ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్..
  • ప్రపంచంలో అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు కావడం సంతోషకరం
  • అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు
  • జనవరి 19వ తేదీ క్యాలెండర్‌లో అంబేద్కర్ డేగా చరిత్రలో నిలిచిపోతుంది
  • ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషకరం
  • రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ, రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారు
  • పిచ్చి రాతలు రాస్తున్న వారిద్దరూ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారు. 


రామోజీ.. వయసుకు తగినట్టు నడుచుకో: మంత్రి పెద్దిరెడ్డి 

  • రామోజీరావుకు ఏం అర్హత ఉందని సీఎం జగన్‌ గురించి రాశారు. 
  • రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి.  
  • వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. 
  • నేను 2009లో ఫారెస్ట్‌ మంత్రిగా పనిచేశాను. 
  • ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. 
  • ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. 
  • చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది.
  • చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్  రెడ్డి ఎవరు?. 
  • 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. 
  • ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. 
  • ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. 
  • సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. 
  • గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్‌సీపీ సాధిస్తుంది. 
  • చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. 
  • మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. 
  • ముఖ్యమంత్రి జగన్‌ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. 
  • చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు.

Advertisement
Advertisement