Siddam Sabha: బాపట్ల ‘సిద్ధం’.. మార్చి 10న

28 Feb, 2024 16:16 IST|Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభను మార్చి 10న నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్చి 3న జరగాల్సిన సభను మార్చి 10వ తేదీకి మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. మొత్తం 15 లక్షల మంది  సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

‘‘98 ఎకరాలలో సభ ప్రాంగణం ఉంటుంది. పార్కింగ్ కోసం కూడా భారీ  ఏర్పాట్లు చేస్తున్నాం. 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై పార్టీ  అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో దిశా నిర్ధేశం చేస్తారు. 13,14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘‘సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పేద వర్గాలతో పాటు అగ్రకులాలలో కూడా వైఎస్సార్‌సీపీపై అపూర్వ స్పందన ఉంది. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నాం. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైఎస్‌ జగన్ ప్రభుత్వం పాలన చేసింది. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో మధ్యాహ్నం 3  గంటలకు సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. 5 గంటలకు సభ ముగుస్తుంది’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

‘‘మేనిఫెస్టో పై చర్చ జరుగుతోందని.. అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందని, పొత్తులు ఎవరు పెట్టుకున్నా.. ప్రజలు మా వైపే ఉన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: ఆస్తుల అమ్మకం.. పవన్‌ సరికొత్త నాటకం 

whatsapp channel

మరిన్ని వార్తలు